06-09-2025 09:18:12 AM
ఖమ్మం (విజయ క్రాంతి): ఖమ్మం మధురనగర్ సాయిబాబా మందిరం లో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం, రాత్రి గణపతి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమ పూజ లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కుంకుమ పూజ అనంతరం బాబావారి మధ్యాహ్న హారతి తరువాత బాబా వారి మహా అన్నప్రసాదం వితరణ చిత్తారు శ్రీనివాసరావు కృష్ణవేణి దంపతులచే నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. రాత్రి 8 గంటలకు వినాయక స్వామి కల్యాణమహోత్సవం అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి సి సి బి మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, 14 వ డివిజన్ కార్పొరేటర్ కూరాకుల వలరాజు, ఆలయ కమిటీ సభ్యులు, మధురానగర్ శ్రీనగర్ రోటరీనగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.