23 June, 2026 | 10:07 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

యూరియా కొరత వెనుక దాగిన కుట్ర

06-09-2025 02:05 AM

-పంట దిగుబడి తగ్గించి సన్నాలకు బోనస్ ఎగ్గొట్టేందుకే.. 

-కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గమైన వైఖరి 

-రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయం 

-బాన్సువాడలో ‘పోచారం’ ఓటమి తప్పదు

-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): పంట దిగుబడి తగ్గించి, తద్వా రా సన్నాలకు బోనస్ ఎగ్గొట్టాలనే ఉద్దేశంతోనే రాష్ట్రప్రభుత్వం రైతులకు యూరి యా సరఫరా చేయడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. యూరియా సంక్షోభంపై రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తు న్న తీరు అనేక అనుమానాలకు తావిస్తున్నదని అభిప్రాయపడ్డారు. యూరియా కొరత వెనుక కుట్ర దాగి ఉన్నదని ఆయ న అన్నారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వారికి గులాబీ కండువాలు  కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. వ్యవసాయ రంగం, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గమైన వైఖరి అవలంబిస్తున్నదని ఆరోపించారు. ఎమ్మెల్యేల పార్టీ  ఫిరాయింపులపై సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసిన సంగతిని గుర్తుచేశారు. త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని, ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఫిరాయింపులపై గడువులోపు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని తేలిచెప్పారు.

పోచారం ఎమ్మెల్యే పదవి పోయే వరకూ న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పోచారం, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో.. చెప్పుకోలేని దయనీయమైన స్థితిలో ఉన్నారని అభిప్రాయపడ్డారు. దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్న రాష్ట్రాన్ని.. బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ చేతిలో పెడితే, ఆ ప్రభుత్వం పాలనకు పాలన చేతకపోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే ప్రజల వ్యతిరేకతను మూటగ ట్టుకుందని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై దృష్టి సారించకుండా, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను తిట్టడంతోనే పబ్బం గడుపుకొంటున్నారని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ పాలనలోనే అయిన అప్పు లు రూ. 2.80 లక్షల కోట్ల అప్పు మాత్రమేనని, ఇదే విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని గుర్తుచేశారు.  గత ప్రభుత్వం ఏడాదికి రూ. 20 వేల కోట్ల అప్పు చేస్తే, ఈ ప్రభుత్వం నెలకు రూ. 20 వేల కోట్ల చొప్పున అప్పు చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తన చెప్పుతో తామే కొట్టుకునే దుస్థితి వచ్చిందని ఎల్లారెడ్డిపేటకు చెందిన లక్ష్మణ్ అనే రైతు ఆవేదన వ్యక్తంచేస్తే, అతడిపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయి ంచిందని ధ్వజమెత్తారు.

దేశానికే అన్నం పెట్టే రైతుపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఇంత జరుగుతున్నా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏం చేస్తు న్నట్లు? అని ప్రశ్నించారు. సర్కార్ ఇకనైనా లక్ష్మణ్‌ను వేధించడం మానుకోవాలని హితవు పలికారు. లేదంటే బీఆర్‌ఎస్ ఉద్యమం చేపట్టేం దుకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కోటగిరి వల్లేపల్లి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ బాన్సువాడ నార్ల రత్నకుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బొట్టె గజేందర్, మాజీ సర్పంచులు పద్మా మొగులయ్య, బంజా గంగారాం, కురలేపు నగేశ్, మాజీ కో- సభ్యుడు హకీమ్ తదితరులున్నారు.