06-09-2025 10:03:13 AM
హైదరాబాద్: తొమ్మిది రోజుల గణేష్ చతుర్థి ఉత్సవం శనివారం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ సరస్సు(Hussain Sagar Lake) వైపు 69 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ గణేష్(Khairatabad Ganesh) విగ్రహ ఊరేగింపు ప్రారంభం అయింది. రెండు గంటలు ఆలస్యంగా ఊరేగింపు ప్రారంభం కావడంతో బడా గణపతి ముందుకు సాగుతున్నాడు. ఉదయం 7.44 గంటలకు విగ్రహాన్ని మోసుకెళ్లే వాహనం ప్రతిష్టాపన స్థలం నుండి కదులుతుండగా బిగ్గరగా గణేష్ మహారాజ్ కీ జై.. అంటూ బయలుదేరింది. విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ముందు ఉత్సవ స్థలంలో భక్తజనం గుమిగూడారు.
హుస్సేన్ సాగర్ వరకు 2.5 కి.మీ. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి దారి పొడవునా శాంతియుత వాతావరణాన్ని కాపాడటానికి పోలీసు సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు భారీగా మోహరించారు. ఊరేగింపు మధ్యాహ్నం 1.30 గంటలకు నిమజ్జన స్థలానికి చేరుకుంటుంది. హుస్సేన్ సాగర్‌లోనే(Hussain Sagar) దాదాపు 50,000 విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. నగరవ్యాప్తంగా నిమజ్జన ఊరేగింపులు 40 గంటలకు పైగా కొనసాగే అవకాశం ఉంది. దాదాపు 29,000 మంది పోలీసు సిబ్బంది పలు షిఫ్టులలో పనిచేయనున్నారు. వీరు డ్రోన్ నిఘా, కీలకమైన జంక్షన్లలో 250 అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాట్లను పరిశీలిస్తారు. హైదరాబాద్‌లో వినాయక మహా నిమజ్జనోత్సవం జరుగుతోంది. హుస్సేన్‌సాగర్‌తో పాటుపలు ప్రాంతాల్లో వినాయక నిమజ్జనాలు చేస్తున్నారు భక్తులు. 20 ప్రాంతాల్లో భారీ విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. హుస్సేన్‌సారగ్ చుట్టూ నిమజ్జనానికి 30 క్రేన్లు ఏర్పాటు చేశారు. సరూర్‌నగర్, ఐడీపీఎల్, సఫిల్‌గూడ, సున్నంచెరువు సహా 20 చెరువులు, 72 కృత్రిమ కొలన్లలో నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 134 క్రేన్లు 259 మొబైల్ క్రేన్లతో నిమజ్జనం చేస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 303 కి.మీ. మేర శోభాయాత్రలు కొనసాగుతున్నాయి.