06-09-2025 09:35:14 AM
హైదరాబాద్: బాలాపూర్ గణేష్(Balapur Ganesh) చివరి పూజ పూర్తి అయింది. బాలాపూర్‌లో గణేష్ ఊరేగింపు కొనసాగుతుంది. గణేశుడి ఊరేగింపు నెమ్మదిగా సాగుతోంది. లడ్డూ వేలంపాట నిర్ణీత సమయంకంటే అలస్యమయ్యే అవకాశం ఉంది. కాసేపట్లో బొడ్రాయి దగ్గర వేలం పాట ప్రారంభం కానుంది. ఈసారి వేలంపాటలో ఏడుగురు పాల్గొననున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం(Balapur Laddu Auction) పాట ప్రారంభం కానుంది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి(Balapur Ganesh Utsav Committee ) యాక్షన్‌లో పాల్గొనేవారి ఫైనల్ లిస్ట్ ప్రకటించింది.
1. మర్రి రవికిరణ్ రెడ్డి (చంపాపేట్), 2. అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి (ఎల్బీ నగర్), 3. లింగాల దశరథ్ గౌడ్ (కర్మాన్‌ఘాట్) ,4. కంచర్ల శివారెడ్డి (కర్మాన్‌ఘాట్) , 5. సామ రాంరెడ్డి (దయా).. కొత్తగూడెం, కందుకూరు , 6. పీఎస్‌కే గ్రూప్ (హైదరాబాద్), 7. జిట్టా పద్మా సురేందర్‌రెడ్డి (చంపాపేట్)లు బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంలో పాల్గొననున్నారు. అటు హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. గణేష్ శోభాయాత్ర వాహనాలతో నెక్లెస్ రోడ్ కిక్కిరిసింది. నిమజ్జనానికి వాహనాలు బారులుతీరాయి. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన ఘట్టం ప్రారంభమైందని అధికారులు పేర్కొన్నారు. మండపాలనుంచి బొజ్జ గణపయ్యలు ట్యాంక్‌బండ్‌కు తరలివస్తున్నాయి.