06-09-2025 10:17:42 AM
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రసిద్ధ పర్యావరణ అనుకూల ఖైరతాబాద్ గణేష్ శోభా యాత్ర(Khairatabad Ganesh Shobha Yatra) శనివారం ఉదయం 8 గంటలకు గణేష్ మండపం నుండి ‘గణపతి బప్పా మోరియా’ నినాదాల మధ్య ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర వేగంగా కొనసాగుతుంది. రాజ్ దూత్ సర్కిల్ నుంచి వేగంగా గణేశుడి యాత్ర జరుగుతుంది. ఖైరతాబాద్ మహాగణపతి టెలిఫోన్ భవన్ సమీపానికి చేరుకున్నారు. శోభాయాత్రకు ముందు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పండల్ వద్ద శ్రీ విశ్వ శాంతి మహా శక్తి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శోభా యాత్ర టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ గార్డెన్(NTR Garden) వైపు సాగింది. వందలాది మంది స్థానికులు ఖైరతాబాద్ గణేష్ కు పూలు చల్లి వీడ్కోలు పలికారు. శోభా యాత్ర ప్రశాంతంగా జరిగేలా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం(Khairatabad Ganesh immersion) మధ్యాహ్నం 1.30 గంటల నాటికి జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బాహుబలి క్రేన్ పాయింట్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణతి నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జన కార్యక్రమంలో 10 లక్షల మంది పాల్గొనే అవకాశముంది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనే 3వేలకు పైగా పోలీసులు బందోబస్లు నిర్వహిస్తున్నారు. మహిళల భద్రతకు మఫ్తీలో షీటీమ్స్ విధులు నిర్వహిస్తున్నారు.