15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

స్వచ్ఛ భారత్‌కు సహకరించాలి

22-11-2025 12:08 AM

ఘన వ్యర్ధాల నిర్వహణ పార్కును సందర్శించిన కమిషనర్ శైలజ

మేడిపల్లి, నవంబర్ 21 (విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఎ.శైలజ ఘన వ్యర్థాల నిర్వహణ పార్కు ను శుక్రవారం సందర్శించి, కొనసాగుతున్న వ్యర్థాల ప్రాసెసింగ్ కార్యకలాపా లను సమీక్షించారు.ఈ సందర్భంగా కమీషనర్ మాట్లా డుతూ.. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిత్యం 78 స్వచ్చ ఆటోల ద్వారా చెత్తను సేకరించడం జరుగుతున్నది.

కాని ఇట్టి స్వచ్చ ఆటోలకు తడి,పొడి చెత్తను కలిపి అందచేయడం వలన డంపింగ్ యార్డ్ కు వచ్చే చెత్త ఎక్కువ మొత్తంలో రావడంతో చెత్త నిర్వహణ,రవాణా చేయడం సమస్యగా మార డంతో పాటు, డంపింగ్ యార్డ్ త్వరగా నిండుతుంది.

కావున కాలనీ వాసులకు,రెసిడేన్శియల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు పొడి చెత్తను వేరు చేసి ఇచ్చే విధము గా ప్రజలకు అవగాహన కల్పించి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్ కొరకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమములో అసిస్టెంట్ కమీషనర్ శ్యాం సుందర్ రావు, సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ నిఖిల్, డంపింగ్ యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.