calender_icon.png 22 November, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెకుముకి సైన్స్ సంబరాలు – మండల స్థాయి పోటీకి మంచి స్పందన

22-11-2025 12:06:21 AM

కుభీర్,(విజయక్రాంతి)చెకుముకి సైన్స్ సంబరాల లో భాగంగా మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ను కుభీర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుభీర్ మండల పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంగ్లీష్ మీడియం విభాగంలో కుభీర్ ఉన్నత పాఠశాల నుంచి దివ్యజ్ఞ (10వ తరగతి), అభినయ (9వ తరగతి), సైఫుల్లా ఖాన్ (8వ తరగతి) విద్యార్థులు ప్రథమ స్థాయి లో నిలిచారు. 

తెలుగు మీడియం విభాగంలో నిగ్వ పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించగా, రెసిడెన్షియల్ విభాగంలో కేజీబీవీ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుభీర్ ప్రధానోపాధ్యాయులు ఎస్. గంగాధర్ గారు, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.