పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
మున్సిపల్ వైస్ చైర్మన్ భాగ్యవతి
ఎల్లారెడ్డి మే 15 (విజయ క్రాంతి) : మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎల్లారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ భాగ్యవతి పట్టణ ప్రజలకు సూచించారు. శుక్రవారం ఎల్లారెడ్డి మున్సిపల్ పరిదిలోని ఏడవ వార్డు పరిధిలో ‘డ్రై డే ఫ్రై డే’లో భాగంగా డెంగీ నివారణ చర్యలు చేపట్టారు.
వైద్యాధికారి డాక్టర్ శరత్ కుమార్ పర్యవేక్షణలో వార్డు పరిధిలోని దోభి గల్లీ, ఆదర్శ నగర్ తదితర ప్రాంతాల్లో లార్వా సర్వే నిర్వహించి నిల్వ నీటిని తొలగించారు. మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ భాగ్యవతి పాల్గొని నీటి నిల్వలపై ప్రజలకు అవగాహన కల్పించారు. దోమలు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. ఈ,కార్యక్రమంలో మున్సిపల్, కమిషనర్ జగ్జీవన్, మతమాల ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, గోవర్ధన్ రెడ్డి, ఆరోగ్య కార్యకర్త ఇందిరా ఆశా కార్యకర్తలు సవిత, సంధ్య, లావణ్య మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.






