16 May, 2026 | 2:10 AM

నిజాంసాగర్ గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన

16-05-2026 12:16 AM

నిజాంసాగర్ మే 14( విజయక్రాంతి) ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగాశుక్రవారం రోజు నిజాంసాగర్ శాఖ గ్రంథాలయం నందు  పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజాపండరి పాల్గొని  గ్రంథాలయాల్లో పుస్తక పఠనంతో పేద విద్యార్థులు ఎందరో ఉన్నత చదువులను అధిరోహించారని  ఆయన పేర్కొన్నారు. గ్రంథాలయాల్లో మౌలిక వసతులు కల్పనకు తనవంతు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.కార్యక్రమంలో శాఖ గ్రంధాలయ ఇన్చార్జి రేఖ, నాయకులు యూనిస్ పటేల్, కమ్మరికత్తా అంజయ్య,,, బాల సాయిలు,ఏశయ్య నర్సింలు కిషోర్ వినయ్,కిరణ్,అశోక్ నరేష్ సందీప్ కుమార్ పాల్గొన్నారు.