14-04-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 13 ( విజయక్రాంతి ): బీపి మండల్ వర్ధంతి సందర్భంగా నల్లగొండ పట్టణములు బీపీ మండల్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోకనబోయిన రమణ ముదిరాజ్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
బీపీ మండల్ ఓబీసీల అభివృద్ధికి రిజర్వేషన్ అంశమై తయారుచేసిన సిఫార్సులను పూర్తిగా అమలు పరచినట్లయితే దేశవ్యాప్తంగా ఓబీసీలకు న్యాయం చేసిన వారవుతారని కావున అన్ని రాజకీయ పార్టీలు కూడా వీటిపై దృష్టి పెట్టి బీసీలతో పాటు పోరాడాలని కోరారు, ఇట్టి సమావేశానికి విచ్చేసి బీసీల పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందనీ తెలిపిన బిజెపి పార్టీ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపు తున్నామన్నారు, బీసీలను సమన్వయం చేసి కార్యక్రమం ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణను అభినందించారు