05-09-2025 12:25:06 AM
జనగామ, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : భవిష్యత్ తరాలకు కావలసిన ఆక్సిజన్ ను అందించే బాధ్యతను మనమే తీసుకోవాలి. గురువారం ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం బతుకమ్మ కుంటలో చేపట్టగా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పింకేష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..మొక్కలు నాటడమే కాదని రక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని, అది కుటుంబంలో అలవాటుగా మార్చుకోవాలన్నారు. భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ అందించే బాధ్యతను మనమే తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహితం కోరుతూ, పచ్చదనం పెంచుతూ, పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారి అనిత, ఎక్సైజ్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు