05-09-2025 12:24:17 AM
నిజామాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : విగ్నేశ్వర నవరాత్రుల సందర్బంగా నగరంలో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలను నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్* దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాల కు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు హిందూ ధర్మ సంస్కృతి, సంప్రదాయాల ఐక్యతే దేశ సమైక్యతకు మూలం అన్నారు. మన సంస్కృతిలో భాగంగానే ఇందూర్ జిల్లా ఆధ్యాత్మిక కేంద్రంగా పిలుస్తోందన్నారు.
బలగంగాధర్ తిలక్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ల స్ఫూర్తితో సనాతన హిందూ ధర్మ రక్షణకై యావత్ హిందూ సమాజాన్ని ఒకటి చేయడానికి యువతి, యువకులు చిన్నారులంతా కలిసి భక్తి శ్రద్దలతో గణపతి నవరాత్రులు నిర్వహించడం హిందువులుగా గర్వించదగ్గ విషయం అనీ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. హిందువుల ఐక్యత ఈ తొమ్మిది రోజులే కాకుండా భవిష్యత్ లో హిందూ సమాజానికి, హిందూ ధర్మానికి ఎటువంటి ఆపద వచ్చిన హిందువులంత ఐక్యతతో జాయించాలనీ ఆయన పిలుపునిచ్చారు.
హిందు దేవాలయాలపై హిందూవుల పై జరుగుతున్నా దాడులను హిందువులంత సంఘటితం అయ్యి ఎదుర్కోవాలని సూచించారు. అనంతరం పలు మండపాలలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బట్టికిరి ఆనంద్, పవన్ ముందడ, మరవర్ కృష్ణ, సతీష్ నాయకులు రమేష్ మండల నిర్వాహకులు గణేష్ మండలి విరుహకులు తదితరులు పాల్గొన్నారు.