calender_icon.png 9 September, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక భజన

05-09-2025 12:25:22 AM

నిజామాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : విగ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ ప్రెస్టేజ్ లో కొనసాగుతున్న వినాయక పూజ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు భజన కార్యక్రమం బుధవారం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో నెలకొల్పిన గణపతి ప్రత్యేక పూజలు అందుకున్నారు. ప్రతి ఏడూ వినాయకుని నెలకొల్పే అనవాయతి వస్తోంది.

అందులో భాగంగానే ఈ ఏడు కూడా వినాయక చవితి రోజు నిజామాబాద్ ప్రెస్క్లబ్లో ఆశీనుడైన విగ్నేశ్వరుని నెలకొల్పారు. బుధవారం రోజు మధ్యాహ్నం జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమం లో నిజామాబాద్ ప్రెస్క్లబ్లో ప్రత్యేక భజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైట్ల సుబ్బారావు ప్రముఖ ఆధ్యాత్మిక గాయకులు అవినాష్ సుబేదార్ మేఘన సుబేదార్, వైద్య కారుడు గాయకుడు సంతోష్ సుబేదార్ శ్రీ అశోక్ గారు భగవాన్దాస్ గారు భక్తి గీతాలను ఆలపించారు.

జర్నలిస్టు ప్రమోద్ తో పాటు అశోక్ సంతోష్ తమ సంగీత వాయిద్యాల భక్తి గీతాలుకు సంగీతం అందించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భజన కార్యక్రమం జర్నలిస్టులతో పాటు భక్తులను కట్టుకుంది. బుధవారం రోజు ఆంధ్రజ్యోతి ప్రతినిధి అన్నం ఆంజనేయులు ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించడంతోపాటు ఆంజనేయులు అన్న అన్న ప్రసాద వితరణ కావించారు.

భక్తులు జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాను పొంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వినాయక భక్తులను వినాయక గీతాలు భజన కార్యక్రమం అంతగా ఆకట్టుకుంది. నిజామాబాద్ జిల్లా జర్నలిస్టులు అధిక సంఖ్యలో ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.