calender_icon.png 29 July, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన మహోత్సవ లక్ష్యాల దిశగా కృషి చేయాలి

29-07-2025 01:59:13 AM

వనపర్తి, జూలై 28 ( విజయక్రాంతి ) :  వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమం లక్ష్యాలను సాధించేందుకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వన మహోత్సవం కార్యక్రమానికి సంబంధించి సాధించాల్సిన లక్ష్యాలపై కలెక్టర్ జి ల్లా అటవీ శాఖ అధికారి అరవింద్ ప్రసాద్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమం లక్ష్యాలను సాధించేందుకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.

ప్రజావాణి కి 70 పిర్యాదు లు 

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం కు 70 పిర్యాదులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజల ఫిర్యాదులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయా లని అధికారులను సూచించారు.

ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్ని తనిఖీ చేయాలి

 అందరు ప్రత్యేక అధికారులు జిల్లాలో తమకు కేటాయించిన మండల పరిధిలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్ని తనిఖీ చేసి అక్కడ నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు వడ్డించేలా చొరవ తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఆయా పాఠశాలల్లో పరిశుభ్రత ఉండేలా డ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నీటి ట్యాంకుల శుభ్రతకు సంబంధించి ట్యాంకుల వద్ద రిజిస్టర్లు మైంటైన్ చేయాలని సూచించారు.

ఇక అన్ని మండల తహసిల్దార్లు భూభారతి రెవెన్యూ సదస్సుల అప్లికేషన్లను పరిష్కరించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, అన్ని జిల్లా శాఖల అధికారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.