నమ్మి ఓట్లు వేస్తే నట్టేట ముంచారు
- సీఎస్‌ఆర్ నిధులు స్థానికంగా ఖర్చు పెట్టకపోతే ప్రజా ఉద్యమం
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- గులాబీమయమైన జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్
పటాన్ చెరు, మే 31: ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ అబద్ధాల పునాదులపై పాలన కొనసాగిస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి..సంక్షేమంలో దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దితే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇం డ్ల కూల్చివేతలు.. రైతుల రోధనలు.. నిరుద్యోగుల ఆక్రందనలు.. హామీల ఎగవేతలతో పా లన కొనసాగిస్తున్నారని విమర్శించారు.
రాబోయే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పటాన్ చె రు నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది డివిజన్లలో బిఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగరవేసి కేసిఆర్ కు గిఫ్ట్ గా అందిస్తామని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఆదివారం ప టాన్ చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన బిఆర్‌ఎస్ పార్టీ పటాన్ చెరు నియోజకవర్గస్థాయి సభ్యత్వ నమోదు అంశంపై బూత్ లెవెల్ కా ర్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, స భ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రో ళ్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు పటాన్ చెరు నియోజకవర్గంలో గులాబీ జెండాను ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలం పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి.. సంక్షేమంలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ పరిశ్రమల ద్వారా అందిస్తున్న సి ఎస్ ఆర్ నిధులను స్థానిక అభివృద్ధి పనులకు కేటాయించాలని..
లేనిపక్షంలో వేలాది మందితో కలిసి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించడం జరుగుతుందని హెచ్చరించారు. బిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. పటాన్ చెరు నియోజకవర్గం అంటేనే బిఆర్‌ఎస్ పార్టీకి కంచుకోట అని.. ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని రికార్డు స్థాయిలో పటాన్ చెరు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






