వెలిచాల ప్రజా కార్యాలయ గణేష్ నిమజ్జనం..
02-09-2025 07:19 PM
ప్రత్యేక పూజలు చేసిన వెలిచాల రాజేందర్ రావు, జిల్లా కలెక్టర్, సిపి
కొత్తపల్లి,(విజయక్రాంతి): వెలిచాల ప్రజా కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని కొత్తపల్లి చెరువులో మంగళవారం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా గణేష్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ అలాం, ఇతర అధికారులు, కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ విగ్రహాన్ని కార్యాలయ సిబ్బంది కొత్తపల్లి చెరువులో నిమజ్జనం చేశారు.






