17 April, 2026 | 12:07 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

మమ్మల్ని నిరాశ్రయులను చేశారు

26-02-2026 12:45 AM
  1. సర్వం కోల్పోయి, రోడ్డునపడ్డాం
  2. ఖమ్మంలో భూదాన్ భూముల బాధితుల ఆవేదన
  3. బీజేపీ నాయకులతో కలిసి ఆందోళన

ఖమ్మం టౌన్, ఫిబ్రవరి 25 (విజయ క్రాంతి): ‘మా ఇళ్లను, గుడిసెలను కూలగొట్టి  మమ్మల్ని నిరాశ్రయులను చేశారు. సర్వం కోల్పోయి, రోడ్డునపడ్డాం’ అంటూ ఖమ్మంలోని భూదాన్ భూముల బాధితుల ఆవేద న వ్యక్తం చేశారు. భూదాన్ భూముల బాధితులకు అధికారులు ఖమ్మంలోని అంబేద్కర్ భవన్‌లో ఆశ్రయం కల్పించారు.

సర్వం కోల్పోయి ఎక్కడ నివాసం లేని అనేక మం ది ఈ భవనంలో ఉంటున్నారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం బీజేపీ నాయకులు బా ధితులను కలిశారు. వారిని చూసిన బాధితులు బోరున విలపించారు. రూపాయి రూ పాయి కూడగట్టుకుని కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఇళ్లు ఏర్పాటు చేసుకుంటే, అధికారులు, పోలీసులు మంగళవారం ఉద యం నాలుగు గంటల నుంచి వేలాదిగా వచ్చి మా ఇళ్ళను కూలగొట్టి మమ్మలను నిరాశ్రయులు చేశారని బాధితులు బోరన విలిపిస్తున్నారు.

బీజేపీ నాయకులతో కలిసి బాధితులు ఖమ్మం ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద గల లాకారం టెంపుల్ వద్ద ధర్నా నిర్వహించారు. కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు చేరుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ధర్నా విరమించకపోవడంతో బీజేపీ నాయకులను అరెస్టు చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

పేదల ఇళ్ల కూల్చివేత దారుణం: బీజేపీ

పేదల సంక్షేమమే ధ్యేయమని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వ అసలు స్వరూపం ఖమ్మం నగరంలో బయటపడిందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు,  జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. ఖమ్మం అంబేద్కర్ భవనంలో తలదాచుకుంటున్న భూదాన్ నిర్వాసితులను వారు పరామర్శించారు. వారి దీనస్థితిని చూసి చలించిపోయిన నాయకులు బాధితుల బాధలను అడిగి తెలుసుకున్నారు. నిరుపేదల ఇళ్లను కూల్చి నిరాశ్రుయులను చేయడం తగదన్నారు. ఈ కష్టకాలంలో బీజేపీ వారికి పూర్తి అండగా ఉం టుందని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసా కల్పించారు.