calender_icon.png 13 November, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిల్లుకు ధాన్యాన్ని లోడ్ చేసి తరలించాలి

13-11-2025 12:29:54 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి మండలం, నవంబర్ 12 : వరి కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యంలో నిర్దేశించిన తేమ శాతం వచ్చిన వెంటనే కేటాయించిన మిల్లుకు ధాన్యాన్ని లోడ్ చేసి తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ వనపర్తి మండల పరిధిలోని పెద్దగూడెం తండా పరిధిలో ఏర్పాటుచేసిన ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అక్కడ రైతులు ఆర పోసుకున్న వరి ధాన్యం యొక్క తేమ శాతాన్ని కలెక్టర్ పరిశీలించారు. పీపీసీ కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతుల రిజిస్టర్ను పరిశీలించిన కలెక్టర్ ఎంతమంది రైతులు వచ్చారు, ఎంతమంది ధాన్యంలో నిర్దేశించిన తేమ వచ్చిందని పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తెచ్చిన ధాన్యంలో నిర్దేశించిన తేమ శాతం రావడంతో కేటాయించిన మిల్లుకు లోడ్ చేసి పంపించాలని సూచించారు.   డి సి ఎస్ కాశి విశ్వనాధ్, డిపిఎం ప్రభాకర్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఎంపీడీవో, ఇతర అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.