13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఉద్యోగులను ఒకే తాటిపైకి తీసుకొస్తాం

27-03-2026 02:01 AM
  1. మున్సిపల్ ఉద్యోగ జేఏసీ ఏర్పాటు చేస్తాం
  2. సన్నాహాక సమావేశంలో నాయకుల నిర్ణయం

ఖమ్మం, మార్చి 26(విజయక్రాంతి): టీఎన్‌జీవో కార్యాలయంలో గురువారం ఖమ్మం కార్పొరేషన్ లోని ముఖ్య నాయకులు తో జేఏసీ ఏర్పాటు కి సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించబడింది. ఖమ్మం జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ముఖ్య ఉద్యోగ నేతలతో జేఏసీకి సంబంధించిన అంశాలపై చర్చించారు.

ఇటీవల నిర్దిష్ట అభియోగం లేకుండా ఒక ఉద్యోగిని సరెండర్ చేయాలన్న కార్పొరేటర్‌ల తీర్మానాన్ని ఉద్యోగులందరూ వ్యతిరేకించారు. చాలా మంది కార్పొరేటర్లు మాకు విషయం చెప్పకుండా తీర్మాన కాపీల మీద సంతకాలు సేకరించారని ఉద్యోగ సంఘాల నేతల వద్ద చెప్పారని ఇదే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగ సంఘాల నేతలు తెలియ చేశారు. ఖమ్మం కార్పొరేషన్‌లో పనిచేస్తున్న సుమారు 1200 మంది ఉద్యోగులతో ఉద్యో గ జేఏసీ ఏర్పాటు చేసి ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం ఒక వేదిక ను ఏర్పాటు చేయడానికి ఈ రోజు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.

సమావేశంలో టీఎన్‌జీవో జిల్లా కార్యదర్శి కొణిదెన శ్రీనివాస్, టీజీవో కార్యదర్శి వేలాద్రి, టీఎన్‌జీవో జాయింట్ సెక్రటరీ తాళ్లూరి శ్రీకాంత్, నాల్గోవ తరగతి ఉద్యోగుల సంఘ అధ్యక్ష కార్యదర్శులు బిక్కు, రమణ, టీఎన్‌జీవో ఖమ్మం పట్టణ అధ్యక్షులు ప్రభాకర చారి, మున్సిపల్ ఉద్యోగుల ఫోరమ్ అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్, శ్రీనివాస్, మున్సిపల్ ఉద్యోగుల నాల్గోవ సంఘం అధ్యక్షులు బుర్రి వెంకటేశ్వర్లు , వెంకట లక్ష్మి, బుర్రి నాగేశ్వర రావు, హేమంత్, కవిత. రవీందర్, నాగ రాజు, వసంత, ప్రేమ్ రెడ్డి , సాంబయ్య,తదితరులు పాల్గొన్నారు.