calender_icon.png 27 December, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం

27-12-2025 12:59:32 AM

  1. అత్యవసరమైన ప్రతి చోట అభివృద్ధి పనులు

జనవరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు 

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్, డిసెంబర్ 26 (విజయక్రాంతి):అభివృద్ధి పనులను ఏబీసీ కేటగిరీలలో అత్యవసరం ఉన్న చోట నుంచి తొలి ప్రాధాన్యతగా పనులను చేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం వడ్డేపల్లి 60వ డివిజన్ లోని టీచర్స్ కాలనీ, విజయ పాల్ కాలనీలలో 65 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాప న చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 60 డివిజన్లో సుమారు 5 కోట్ల రూపాయల పైచిలుకు నిధులు కేటాయించడం జరిగిందని, గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు 50 లక్షల రూపాయలు నిధులు కేటాయించిన దాకాలు కూడా లేవని అన్నారు. రానున్న ఏడాది కాలంలో దాదాపు అంతర్గత రోడ్ల నిర్మాణ ప నులు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, అభివృద్ధి విషయంలో నాణ్యత ప్రమాదాలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

వరంగల్ మహారానికి తలమానికేగా ఉండేలా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చేతుల మీదగా వచ్చే నెల ప్రారంభం జరగనున్నదని తెలిపారు. మల్టీస్పెషల్టి హాస్పిటల్ త్వరలో పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మేడారం జాతర దృష్టిలో పెట్టుకొని కాజీపేట ఆర్‌ఓబి పనులు ప్రజా రవాణాకు అందేలా ఏర్పాట్లను చేస్తున్నామని కేంద్రం ఆధీనంలో ఉన్న రైల్వే వారిని కోరడం జరిగిందని తెలిపారు.

విమానాశ్రయ భూములు కేటాయింపు ప్రక్రియ పూర్తికావచ్చిందని నిర్మాణ పనులకు ప్రధానమంత్రి ని కలిసి ఆహ్వానించడానికి ప్రభుత్వం చూస్తుందని తెలిపారు. అనంతరం విజయపాల్ కాలనీ లో ఉన్న కేయూ ఎంప్లాయిస్ కాలనీలోని గల కమ్యూనిటీ హాల్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, డివిజన్ అధ్యక్షులు ఎనుకుంటి పున్నం చందర్, 59 వ డివిజన్ ఇంచార్జ్ కేతిడి దీపక్ రెడ్డి,

సోషల్ మీడియా ఇన్చార్జ్ ఎం.డి నిహాల్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు శ్వేతా గణేష్, కాంగ్రెస్ శ్రేణులు మండల సమ్మయ్య, తాళ్లపల్లి రవీందర్ (జె.కె), జనగాం శ్రీనివాస్, బుస్సా నవీన్ కుమార్, వంశీ, కమల్, సాజిద్, కేయు ఎంప్లాయీస్ కాలనీ కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ సాయిలు, కార్యదర్శి రాజ సుధాకర్ రెడ్డి, భాస్కర్, రవీందర్ రెడ్డి, సుందర్, చంద్రమౌళి, రాజన్ బాబు, సుధాకర్, రాజన్న, భాజపా నాయకులు సతీశ్, రామరాజు,అశోక్, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.