calender_icon.png 27 December, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాడర్ ధైర్యమే పార్టీకి బలం

27-12-2025 01:00:50 AM

అధైర్యపడొద్దు అండగా ఉంటాం : పుట్ట మధూకర్

మహాదేవపూర్, డిసెంబర్ 26 (విజయక్రాంతి):స్వార్థ ప్రయోజనాల కోసం నాయకులు వస్తుంటారుపోతుంటారు కానీ పార్టీకి అసలైన బలం క్యాడర్ ధైర్యమేనని మంథని మాజీ ఎ మ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు.శుక్రవారం పలిమెల మండలం సర్వాయి పేట గ్రామంలో లంగరి రవీందర్ నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎ లాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోవద్దని పిలుపునిచ్చారు.మండలానికి చెందిన ఓ నాయకుడు పార్టీ మారినా అన్నా మేమున్నాం అంటూ కార్యకర్తలు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని నెగటివ్గా చూడవద్దని, ఓ టమి గెలుపుకు పునాదని స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి బీఆర్‌ఎస్ కార్యకర్త సైనికుల్లా పనిచేశారని ప్రశంసించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చే యడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని సూచించారు. ప్రజల గుండెల్లో గులాబీ జెండా చెరగని ముద్రలా ఉంటుందని, పరిస్థితుల కారణంగా మాత్రమే ప్రజాతీర్పు మారుతుందని అన్నారు.అధైర్యపడవద్దని, బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.