27-12-2025 12:58:05 AM
దర్శకుడు ఎం. సేనాపతి
ములుగు, డిసెంబర్26,(విజయక్రాంతి):తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను నేటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో తెరకె క్కుతున్న దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణంలో భాగంగా శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని విశ్రాంతి ఉద్యోగస్తుల భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కుమార్ పాడ్య అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎం. సేనాపతి మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎంతోమంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగం చేసినప్పటికీ వారి చరిత్రలు ఇప్పటికీ సమగ్రంగా వెలుగులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వీరుల త్యాగాలను గుర్తుచేస్తూ, దొడ్డి కొమరయ్య జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మిస్తున్నామని తెలిపారు. ఆనాటి చరిత్రను నేటి తరం మాత్రమే కాకుండా రాబోయే తరాలకు అందించాలన్న సంకల్పంతో ప్రజల భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చిలువేరు రామచందర్, కుసూరి సదానందం, ధరావత్ రామ్ చందర్ నాయక్, పోరిక పోమా నాయక్, అజ్మీర శ్యామల్ నాయక్, మూడ్ కసన్ సింగ్, కొర్ర రాజు నాయక్, పోరిక రాహుల్ నాయక్, గుగులోత్ తిరుపతి, రత్నం ప్రవీణ్, బానోత్ అనిల్, బానోత్ రవీందర్, పోరిక కిషోర్, అజ్మీర దేవ్ సింగ్, చంటి తదితరులు పాల్గొన్నారు.