06-10-2025 12:45:44 AM
-ప్రజలను వ్యక్తిగత ప్రశ్నలు అడగవద్దని అధికారులను ఆదేశించా
-కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
కర్ణాటక, అక్టోబర్ 5( విజయక్రాంతి) : ఎవరు ఎన్ని అభ్యంతరాలు తెలిపినా కులగణనను పూర్తి చేసి తీరుతామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలను వ్యక్తి గత ప్రశ్నలు అడగవద్దని కుల గణనకు వెళ్లే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
సర్వే చేస్తున్న సమయంలో ప్రజలు పంచుకోలేని ప్రశ్నలకు అధికారులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.. సర్వే నిర్వహించే అధికారులు స్వతంత్ర కమిషన్‌కు చెందిన వారని... ఆ సమయానికి వారు ఏం చేస్తున్నారో తెలియదన్నారు. 2015లో కర్నాటక వెనుకబడిన వర్గాల కమిషన్ జస్టిస్ కాంత రాజ నేతృత్వంలో కులగణన చేపట్టగా, ఈ డేటా ఆధారంగా కె. జయప్రకాశ్ హెగ్డే నేతృత్వంలో పూర్తి స్థాచి నివేదిక తయారు చేసి సర్కార్‌కు సమర్పించింది.
ఆర్థిక, సామాజిక సమీక్షపై రూ పొందించిన నివేదికను కర్ణాటక ప్ర భుత్వం గతంలోనే ఆమోదించింది. అ యితే, నిఫుణులు రూపొందించిన నివేదికపై భిన్నాభిప్రాయాలు, పలు వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కులగణన చేపట్టింది.