calender_icon.png 6 October, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టులపై పోరుకు మహిళా కమెండోలు

06-10-2025 12:48:00 AM

-దూకుడు పెంచిన దుర్గా ఫైటర్స్ 

-అటవీ గ్రామాల్లో విస్తృతంగా సర్చ్ ఆపరేషన్లు

చర్ల, అక్టోబర్ 5, (విజయక్రాంతి):చర్ల సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్‌గడ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టుల సమస్యను ఎదుర్కొనేందుకు పోలీస్ ఉన్నతాధికారులు దుర్గా ఫైటర్స్ పేరుతో ఏర్పాటు చేసిన మహి ళా కమెండోలు ముందుకు దూసుకుపోతున్నారు. మావోయిస్టుల బెడద ఉన్న సుక్మా జిల్లాలో దుర్గా ఫైటర్స్ బృందం మోహరించి పలు చర్యలు చేపట్టింది. మహిళా కమెండోలు తమ ధైర్యం, నిబద్ధత, అజేయ సంక ల్పంతో మావోయిస్టుల నిర్మూలనలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ మరియు సీఆర్పీఎఫ్ జవాన్లతో కలసి ఈ మహిళా కమెండోలు మావోయిస్టులకు చెక్ పెట్టి సాహసోపేత ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహిస్తున్నారు.వీరంతా దట్టమైన అటవీ గ్రామాల్లోబాల్యాన్ని గడిపి నాటి పరిస్థితులకు తగ్గట్టుగా భయంతో కా లం గడిపిన వీరు నేడు దేశంలో అగ్రగామి మావోయిస్టు ప్రాబల్యాన్ని తగ్గించేందుకు కమెండోలుగా పెరిగిన గడ్డపైనే గన్నులు ఎక్కుపెట్టే స్థాయికి ఎదిగారుఈ మహిళ కమెండోలంతా.

డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ మరియు సీఆర్పీఎఫ్ జవాన్లతో కలసి ఈ మహిళా కమెండోలు మావోయిస్టులకు  చెక్ పెట్టి సాహసోపేత ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఏదోక కాలంలో మావోయిస్టుల భయంతో బాల్యం గడిపిన ఈ మహిళలు, ఇప్పుడు అదే భూభాగంలో మావోయిస్టులను తరిమివేసే శక్తిగా మారారు.సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ (ఐపీఎస్) నాయకత్వంలో జిల్లా వేగంగా మావోయిస్టులను అంతమొందించే దిశగా అడుగులు వేస్తోంది.

డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, అదనపు భద్రతా బలగాలతో పాటు దుర్గా ఫైటర్స్ మహిళా కమాండోలు సుదూర ప్రాంతాల్లో కొత్త శిబిరాలు ఏర్పాటు చేయడం, సర్చ్ ఆపరేషన్లు నిర్వహించడం ద్వారా మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గిస్తున్నారు.అమ్మ దుర్గా స్వరూపంగా నిలిచిన ఈ మహిళా కమెండోలు మావోయిస్టులకు భయంకర స్వప్నంగా మారారు.

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించిన 2025 నాటికి మావోయిస్టు రహిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా సుక్మా జిల్లా ముందంజలో ఉంది. దుర్గా ఫైటర్స్ మహిళా కమాండోలు, భద్రతా సిబ్బందిల నిరంతర కృషితో సుక్మా త్వరలోనే మావోయిస్టు రహిత జిల్లాగా అవతరించనుంది. మావోయిస్టులను మట్టు పెట్టేందుకు భద్రతా బలగాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.