calender_icon.png 27 July, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం నుండి బరిలో ఉంటాం

27-07-2025 08:02:13 PM

ప్రతి బీజేపీ కార్యకర్త ఒక సైనికుడిగా పని చేయాలి..

బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్.. 

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం నుండి బరిలో ఉంటామని బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్(BJP state leaders Pilli Ramaraju Yadav) అన్నారు. ఆదివారం తిప్పర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల మండల పార్టీ అధ్యక్షులు వంగూరు రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మండలంలో రేపు జరగబోయే జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి ప్రతి ఒక్క ఎంపీటీసీకి జడ్పిటిసిగా పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని వారికి అండదండగా ఉంటానని అన్నారు.

ప్రతి ఒక్కరూ పోటీలో ఉండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని కార్యకర్తలను సూచించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని అన్నారు. స్థానిక మంత్రి రోడ్ల మంత్రిగా ఉండికూడా తమ నియోజకవర్గంలోని గ్రామాల్లలో రోడ్లు వేయాలేని పరిస్థితి అన్నారు. భారతీయ జనతా పార్టీ ర్యాలీ కోసం పర్మిషన్ ఉండగా అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పోలీస్ లు ర్యాలీకి ఇబ్బంది కలిగించారన్నారు. మేము పెట్టుకున్న సౌండ్ బాక్స్లని దూరంగా తీసుకెళ్లి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగిందన్నారు.ఇలాంటి ఇబ్బందులు ఎన్ని పెట్టిన భారతీయ జనతా పార్టీని ఏమీ చేయలేరని రేపు జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయమని అప్పుడే అధికార పార్టీలో బెదురు పుట్టి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం జరిగిందని అన్నారు.

ఇలాంటి అధికార పార్టీ నీచ రాజకీయాలకు బుద్ధి వచ్చేలా హైవేపై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ నెంబర్ పల్లె ప్రకాష్, మండల ప్రధాన కార్యదర్శులు నకరికంటి మహేష్, గంగాధర్, సుంకరబోయిన యాదగిరి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి పగిడోజు బ్రహ్మచారి, వడ్డే శ్రీనివాసరెడ్డి, దాసరి నాగరాజ్, తంగెళ్ల సాయికిరణ్ రెడ్డి, మండల కోశాధికారి గంటకంపు నాగరాజు, వల్లెం మాధవరెడ్డి, ఎల్లంల శ్రీనివాస్ రెడ్డి, కుపాకుల దాసు, బీజేవైఎం మండల అధ్యక్షులు దేశాలు శివశంకర్, మర్రి రామకృష్ణ, గుండు శ్రీకాంత్, పాప కంటి సతీష్, బత్తిని మహేష్, మైనం మల్లయ్య, పేరం జోగేందర్, మామిడి నాగరాజు, మామిడి సందీప్, మేడపైన లింగస్వామి, పాపసాని శివ చంద్రు, శివ తదితరులు పాల్గొన్నారు.