calender_icon.png 27 July, 2025 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా తిరిగి గూగులోత్ రామ్ చందర్ ఎన్నిక..

27-07-2025 08:07:48 PM

టేకులపల్లి (విజయక్రాంతి): అశ్వరావుపేటలో జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) సిపిఐ మూడవ మహాసభల్లో జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా గూగులోతు రామ్ చందర్ తిరిగి ఎన్నికయ్యారు. టేకులపల్లి మండల సిపిఐ కార్యదర్శి గూగులోత్ రామ్ చందర్ ను తిరిగి జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకున్నారు. జిల్లా బాధ్యతలో ఉండి మండల పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. పార్టీ ప్రజా సంఘాలు మహిళా సంఘం విద్యార్థి సంఘం యువజన సంఘం ఏఐటీయూసీ సంఘాలను బలోపేతం చేస్తానని కోరారు. ఎంతో నమ్మకంతో జిల్లా పార్టీ ఇచ్చిన బాధ్యతను నిర్వహిస్తానని తెలిపారు.