calender_icon.png 20 December, 2025 | 12:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ డబ్బులు చెల్లిస్తేనే లెప్రసి సర్వే కొనసాగిస్తాం

19-12-2025 12:55:35 AM

సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్

కామారెడ్డి, డిసెంబర్ 18, (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వైద్యరంగంలో పనిచేస్తున్న ఆశ వర్కర్లకు గతంలో నిర్వహించిన లెప్రసీ సర్వేకు డబ్బులు చెల్లించకుండా మళ్ళీ సర్వే నిర్వహించాలని అధికారులు ఒత్తిడి చేయడం సరైన నిర్ణయం కాదని డబ్బులు చెల్లిస్తేనే సర్వే కొనసాగిస్తామని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్ జిల్లా వైద్య అధికారి ౄM&HO డాక్టర్ దివ్యకి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని గురువారం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లకు గతంలో నిర్వహించిన లెప్రసీ డబ్బులు చెల్లించకుండా మళ్లీ సర్వే కొనసాగించాలని అధికారులు ఒత్తిడి చేయడం అధికారులు మాట తప్పడమేనని ఆయన సందర్భంగా అన్నారు.. గత సంవత్సరం నిర్వహించిన లెప్రసీ సర్వేకు ఇప్పటివరకు డబ్బులు చెల్లించకుండా అధికారులు మళ్లీ సర్వే నిర్వహించాలని పీహెచ్ సి ల వారీగా ఆశాలపై ఒత్తిడి చేయడం సరైన నిర్ణయం కాదని డబ్బులు చెల్లిస్తేనే సర్వే కొనసాగిస్తామని ఆయన  అన్నారు.

గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డ్యూటీలు నిర్వహిస్తే ఇంతవరకు డబ్బులు చెల్లించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని ఈ నెలలో  11, 14, 17 తేదీలలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఆశ వర్కర్లు విధులు నిర్వహిస్తే ఇప్పటివరకు ఒక రూపాయి చెల్లించలేదని ఆయన అన్నారు.. అదేవిధంగా గతంలో నిర్వహించిన పల్స్ పోలియో డబ్బులు కూడా చెల్లించ లేదని ఆయన అన్నారు. 

అదేవిధంగా ఏఎన్సి టీబీ టార్గెట్ రద్దు చేయాలని సబ్ సెంటర్లో ఓపి డ్యూటీలను  రద్దు చేసి ప్రతినెల ఆశ బిల్ పేపర్స్ కు సర్వేకు సంబంధించిన సామాగ్రి అధికారులు ఇవ్వాలని ప్రతి నెల ఆశా బిల్ పేపర్స్ అధికారులు ఇవ్వకుండా ఆశలతో తెప్పిస్తున్నారని క్వాలిటీతో  కూడిన యూనిఫామ్స ఇవ్వాలని ఆశా డే సందర్భంగా ఆశలకు ఇచ్చే వ్యాక్సిన్ను సబ్ సెంటర్లు వారిగా డోర్ డెలివరీ చేయాలని   ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి డబ్బులు చెల్లిస్తేనే సర్వే కొనసాగిస్తామని లేదంటే సర్వేను పూర్తిగా బహిష్కరిస్తామని  ఈ సందర్భంగా అధికారులకు విన్నవించారు ఈ కార్యక్రమంలో  ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కీసరి, ఇందిరా, లతా, మంజుల, మమత, రాజమణి, తదితరులు పాల్గొన్నారు