6 May, 2026 | 3:01 AM

మాతృశ్రీ అనసూయ మాత శివైక్యం వారి సేవలు కొనసాగిస్తాం

06-05-2026 01:38 AM

ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అల్లాడి వీరేశం

జహీరాబాద్, మే 5 : సంగారెడ్డి జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్ర మం మాతృమూర్తి ‘అమ్మ’ మాతృశ్రీ అనసూయ మాత (97) మంగళవారం శివైక్యం చెందినట్లు దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం తెలిపారు. మాతృశ్రీ అనసూయ మాత సమాధి కార్యక్రమాలు సా యంత్రం వరకు నిర్వహించారు. మాతృశ్రీ చేసిన సేవలను భవిష్య త్తులో కూడా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. కాగా మాతృశ్రీ మృతితో బర్దిపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.