6 May, 2026 | 2:54 AM

యువతి అదృశ్యం

06-05-2026 01:36 AM

జహీరాబాద్, మే 5 : జహీరాబాద్ పట్టణంలోని నాగుల కట్ట ప్రాంతానికి చెందిన తంబలి సంగమేశ్వర్ కూతురు రాధిక అదృశ్యమైనట్లు పట్టణ ఎస్త్స్ర వినయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 4న రాధిక తన స్నేహితుల వద్దకు వెళ్లి వస్తానని సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని అన్నారు. యువతి తండ్రి సంగమేశ్వర్ స్నేహితుల వద్ద బంధువుల వద్ద వెతికినా లాభం లేకపోవడంతో అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వినయ్ కుమార్ తెలిపారు.