13-12-2025 01:41:46 AM
తిమ్మాపూర్ సర్పంచ్ అభ్యర్థి గంకిడి లక్ష్మారెడ్డి
తిమ్మాపూర్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): గ్రామమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్లు, ఆదరించి ఒక్క అవకాశం ఇస్తే గ్రామ అభివృద్ధి కోసం కృషిచేస్తానని తిమ్మాపూర్ సర్పంచ్ అభ్యర్థి గంకిడి లక్ష్మారెడ్డి ఓటర్లను వేడుకున్నారు. తిమ్మాపూర్‌లో కత్తెర గుర్తు హవా కొనసాగుతుంది. శుక్రవారం గ్రామం లో మహిళలు, యువత, నాయకులతో కలసి లక్ష్మారెడ్డి భారీ ప్రదర్శనతో ప్రచారం నిర్వహించారు. కత్తెర గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామంలో ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్పారు.