27 May, 2026 | 3:09 AM

రైతులకు న్యాయం చేస్తాం

27-05-2026 02:07 AM

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి 

పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తాం  : మల్కాజ్ గిరి సీపీ సుమతి 

 అబ్దుల్లాపూర్ మెట్, 26: కొహెడ భూ బాధతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అంతర్జాతీయ పండ్ల మార్కెట్ నిర్మాణానికి రైతులు, స్థానిక ప్రజలు సహకరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీ  నారాయణ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు.

రంగారెడ్డి జిల్లా,  అబ్దుల్లాపూర్ మెట్  మండల పరిధిలోని కొహెడ సర్వేనెంబర్ 167/1 లో 239 ఎకరాల్లో నిర్మించే అంతర్జాతీయ పండ్ల మార్కెట్ పనులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, మల్కాజిగిరి కమిషనర్ బడుగుల సుమతి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, మార్కెట్ ఉన్నత శ్రేణి అధికారి శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఆర్డీవో  అనంతరెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ అనురాధ, అడిషనల్ డీసీపీ కోటేశ్వర్ రావు , ఏసీపీ కాశిరెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది తో కలిసి మంగళవారం పరిశీలించారు.

అనంతరం రెవెన్యూ మ్యాప్ ను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. కొహెడలో నిర్మించబోయే మార్కెట్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోతున్నట్లు తెలిపారు. వచ్చే నెల 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పండ్ల మార్కెట్ తో పాటు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను నిర్మిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గతంలో ఔటర్ రింగ్ రోడ్డు కాంగ్రెస్ హయాంలోని జరిగిందని గుర్తు చేశారు.  హైదరాబాద్ ప్రాంత ప్రజలకు అవసరమయ్యే నిత్యవసరం వస్తువులు ఒకే చోటు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడమే సీఎం లక్ష్యమన్నారు. మార్కెట్ ఏర్పాటుతో  ఈ ప్రాంతంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అన్నారు.  రాజకీయ పార్టీల నాయకుల మాటలను నమ్మి రైతులు మోసపోవద్దని అన్నారు. 

ప్రతి రైతుకు పరిహారం అందజేస్తాం : కలెక్టర్ నారాయణరెడ్డి

కొహెడ పండ్ల మార్కెట్ భూ భూ బాధితులైన రైతులకు తప్పకుండా పరిహారం వచ్చి న్యాయం చేస్తామని    అన్నారు. కొహెడ పండ్ల మార్కెట్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్  యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని... దీంతో ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. పండ్ల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి రైతులందరూ హాజరుకావాలని కోరారు. 

పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తాం  : సీపీ  సుమతి 

కొహెడ పండ్ల మార్కెట్ నిర్మాణ స్థలంలో  ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్టమైన భద్రత  ఏర్పాటు చేశామని  సీపీ సుమతి అన్నారు. అదేవిధంగా వచ్చేనెల 3న పండ్ల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో పార్కింగ్ కోసం సంగీ టెంపుల్ ప్రాంతంలో 30 ఎకరాలలో పార్కింగ్  ఏర్పాట్లు చేయబోతున్నట్లు  సీపీ తెలిపారు.

కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీసీపీ నరసింహ రెడ్డి, ఏసీ పీ కాశిరెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ ఇన్ స్పెక్టర్ అశోక్ రెడ్డి,  మార్కెటింగ్ ఎస్ ఈ లక్ష్మణ్, డీ ఈ రవీందర్,  ప్రసాద్ రావు, జేడీ మల్లేశం, మార్కెట్ సెక్రటరీ ఎల్.  శ్రీనివాస్,  మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కరాచారి, సభ్యులు జైపాల్ రెడ్డి, మధుసూదన్ రావు, అంజయ్య, రఘుపతి రెడ్డి, మచ్చెందర్ రెడ్డి, నవరాజ్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.