28 June, 2026 | 3:49 PM

Breaking News

పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •  

పర్యావరణ పరిరక్షణకు మా వంతు సహకారం అందిస్తాం

18-06-2025 12:00 AM

తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి 

సూర్యాపేట, జూన్ 17 (విజయక్రాంతి) : పర్యావరణ పరిరక్షణకు మా వంతు సహకారం తప్పక అందిస్తామని తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోనీ సంఘ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణంలో భాగంగా పాఠశాలలో పిల్లలచే మొక్కలు నాటించడం, పిల్లలకు పర్యావరణంపై అవగాహన కల్పించి భవిష్యత్ తరాలకు మనం మట్టి,గాలి, నీరు, కలుషితం కాకుండా చూసేలా అవగాహన కల్పిస్తుడడం అభినందనీయమని అన్నారు.

పర్యావరణం పై మక్కువతో మేము కూడా మా వంతుగా మొక్కలు నాటి వాటిని కాపాడుతామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి హామిద్ ఖాన్, మండల అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి, కార్యదర్శి నాగేశ్వరరావు,, జి వెంకటేశ్వర్లు వి రాములు, వి రామ్ రెడ్డి, తప్పెట్ల శ్రీరాములు, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ జిల్లా కోఆర్డినేటర్ శంకర్ పాల్గొన్నారు.