calender_icon.png 9 October, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజల్లో ఎండగడతాం

09-10-2025 12:38:43 AM

మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 8 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ మోసాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి ప్రజల్లో ఎండగడతామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. బుధవారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్ లో  కాంగ్రెస్ బాకీ కార్డు  ను  విడుదల చేశారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తి కావస్తున్నా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దాదాపు 420 హామీలను ఇచ్చిందని, హామీల అమలు కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని, ప్రశ్నించాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇతర ఎలాంటి ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రజా ప్రతినిధులను నిలదీసేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన సూచించారు. కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంటి యజమాని అనుమతి తీసుకుని ప్రతి ఆడబిడ్డకు, వారి కుటుంబ సభ్యులకు వివరించి కాంగ్రెస్ మోసాలను ఎత్తిచూపుతామని వినోద్ కుమార్ తెలిపారు.

నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగులు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని, జెఏసి చైర్మన్ గా ఉన్న కోదండరాం ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంకు వచైర్మన్ కొందూరి రవీందర్ రావు, వేములవాడ పార్టీ ఇంచార్జి చల్మడ లక్ష్మి నరసింహ రావు, పార్టీ జిల్లా  అధ్యక్షడు తోట అగయ్య, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్,

మాజీ లైబ్రరీ చైర్మన్ శంకరయ్య, సెస్ చైర్మన్ చికల రామారావు, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి,  సెస్ డైరెక్టర్లు శ్రీనివాసరావు , నారాయణరావు, లక్ష్మీనారాయణ, హరిచరణ్రావు, మాజీ జడ్పీ చైర్మన్ అరుణ, మాజీ మున్సిపల్ చైర్మన్ కళా చక్రపాణి, మనోహర్ రెడ్డి,వివిధ బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.