calender_icon.png 9 October, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు బాగు చేయాలని గిర్మాపూర్ గ్రామస్తుల ధర్నా

09-10-2025 12:38:11 AM

మేడ్చల్, అక్టోబర్ 8 (విజయ క్రాంతి): తమ గ్రామానికి వచ్చే రోడ్డు బాగు చేయాలని డిమాండ్ చేస్తూ గిర్మాపూర్ గ్రామస్తులు మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో ధర్నా చేశారు. మేడ్చల్ పట్టణంలో వివేకానంద విగ్రహం నుంచి లైబ్రరీ వరకు డ్రైనేజీ పైప్ లైన్ వేయడానికి రోడ్డు తవ్వినందున రాకపోకలకు నెలల తరబడి ఇబ్బంది అవుతోందని తెలిపారు.

రోడ్డు బాగు చేయించాలని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు బాగు లేనందున తమ గ్రామానికి బస్సు రావడం లేదని, ఫలితంగా గిర్మాపూర్ గ్రామస్తులతోపాటు పాలిటెక్నిక్ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని వారు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు బాగు చేయించాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.