ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: సీతక్క
24-03-2026 12:36 AM
హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరు స్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సోమవారం శాసనమండలిలో బీఆర్‌ఎస్ సభ్యులు నవీన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. విధులు, నిర్వాహాణపై సర్పంచ్‌లకు, వార్డు మెంబర్‌లకు శిక్షణ ఇచ్చామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు రెగ్యులర్‌గా జీతాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు.




