calender_icon.png 9 February, 2026 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

11వ వార్డులో గులాబీ జెండా ఎగరవేస్తాం

09-02-2026 01:07:15 AM

జిన్నారంలో మల్లన్న ఇంటింటికీ ప్రచారం

జిన్నారం/అమీన్‌పూర్, ఫిబ్రవరి 8: జిన్నారం 11వ వార్డులో గెలుపే లక్ష్యంగా మల్లేష్ ముదిరాజ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి గల్లీ తిరుగుతూ ఓటర్లతో మమేకమవుతూ తన అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తున్నారు. అభివృద్ధి మా లక్ష్యం.. క్లీన్ అండ్ గ్రీన్ మా బాధ్యత అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఆయనకు ప్రజల్లో విశేష స్పందన లభిస్తోంది. వార్డులో తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు వంటి ప్రాథమిక సమస్యల పరిష్కారానికే తన తొలి ప్రాధాన్యత అని మల్లేష్ ముదిరాజ్ స్పష్టం చేస్తున్నారు.

ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ పెద్దలు, మహిళలు, యువత అభిప్రాయాలను తెలుసుకుంటూ, సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా కల్పిస్తున్నారు. మీ ఆశీర్వాదం ఉంటే 11వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా అని ఆయన పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో రాజ గౌడ్, రమేష్, ఆరేందర్ గౌడ్, నరసింహ, శేఖర్, దశరథ్, కృష్ణ, బి ఆర్ ఎస్  పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.