calender_icon.png 4 October, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్ల ‘పంచాయితీ’!

04-10-2025 01:30:22 AM

- ఒక్క ఓటరూ లేని వర్గాలకు అవకాశాలు

- పోటీ చేసే వారే లేరని స్థానికుల ఆందోళన

- కేటగిరీలు మార్చాలని డిమాండ్లు

- ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లలో విచిత్రం

సంగారెడ్డి, అక్టోబర్ 3(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పంచాయితీ మొదలైంది. పలు గ్రామాల్లో పోటీలో నిలబడేందుకు అభ్యర్థులే లేని పరిస్థితి నెలకొంది. దీంతో తమ గ్రామాల్లో రిజర్వేషన్ల ఖ రారుపై పునర్ పరిశీలన చేయాలని విన్నవిస్తున్నారు. కొన్ని చోట్ల స్థానికులు నిరసన వ్య క్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను కలుస్తూ రిజర్వేషన్లు మార్చాలని కోరుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వా త మార్చే అవకాశం లేకపోవడంతో ఆ గ్రామాల్లో ఎన్నికలు ఎలా జరుగుతాయనే సందిగ్ధత నెలకొంది.

ఎందుకీ పరిస్థితి?

2011 నాటి జనాభా లెక్కలతో ఎస్సీ, ఎస్టీ వర్గాలు, రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక ఆర్థిక కులగణన సర్వేను పరిగణనలోకి తీసుకుని బీసీలకు రిజర్వే షన్ల ర్యాంకింగ్ ఇచ్చా రు. బీసీ వర్గాల రిజర్వేషన్లకు డెడికేషన్ కమిషన్ సిఫారసులు పరిగణనలోకి తీసుకు న్నారు. రాష్ట్రంలో 2019 తర్వాత ఇప్పుడు జ రుగుతున్న రెండో స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ మండలం యూనిట్గా, జెడ్పీటీసీ జిల్లా యూనిట్గా ర్యాంకింగ్లు ఇచ్చే క్రమంలో ఆయా వర్గాల్లో జనాభా లేనప్పటి కీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇక మహిళలకు 50 శాతం, వంద శాతం ఎస్టీలు ఉన్న చోట్ల వారికే నోటిఫై చే యడం వంటి నిబంధనలు పాటించాల్సి ఉంది.

ఎస్టీ, ఎస్సీ, బీసీల ర్యాకింగ్ ఇచ్చే క్ర మంలో ఒక్క ఓటరు లేని వర్గాలకు కూడా ఆయా చోట్ల రిజర్వే షన్లు ప్రకటించాల్సి వ చ్చింది. ఇక గత ఎన్నికల్లో ఏదైనా కారణం తో ఎన్నిక జరగకపోతే ఆయా వర్గాలకు కే టాయించిన రిజర్వేషన్లు అనుభవించని కార ణంగా మరోసారి వారికే అవకాశం కల్పించే లా జీవో జారీ చేశారు. ఇక షెడ్యూల్ ఏరియాలో గిరిజనులే పోటీకి అర్హులు. దీంతో ఏ గ్రామంలోనైనా గిరిజనులు ఉన్నా లేకు న్నా వారికే అవకాశాలు వస్తున్నాయి. గతం లో జనాభా లెక్కల సమయంలోనూ కొన్ని చోట్ల ఆయా వర్గాల వివరాల నమోదులో తప్పిదాలు జరగడంతోనూ ఇబ్బందులు వ స్తున్నా యి. మళ్లీ జనాభా లెక్కలు జరిగి, ఆ యా వర్గాల వివరాలు స్పష్టత వచ్చే వరకు ఈ పరిస్థితి మారే అవకాశం లేదు.

ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిన రిజర్వేషన్లు..

సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లపై గందరగోళం నెలకొనడంతో ఆశావహులంతా నిరాశతో ఎమ్మెల్యేల చు ట్టూ తిరుగుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఆశావహులైతే మరీ నిరాశగా ఉన్నారు. గత పదేళ్ళుగా పదువులు లేకుండా పార్టీని నమ్ముకొని ఉంటే తాజాగా  రిజర్వేషన్లు వా రి ఆశలపై నీళ్ళు చల్లినట్లయింది. రిజర్వేషన్లు విడుదల కావడంతో అనుకూలమైన ప్రాం తాల్లో రిజర్వేషన్ల రూపంలో దెబ్బకొట్టడం తో వారంతా ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. కొందరైతే ఏకంగా అలకబూని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలంతా తలలుపట్టుకునే పరిస్థితి నెలకొంది. 

ఉప సర్పంచులకే పగ్గాలు..

సర్పంచ్ పదవులు ఆయా వర్గాలకు రిజర్వు కావడంతో వార్డు స్థానాలకు ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. దీంతో వార్డు సభ్యులు తమలో ఒకరిని ఉప సర్పంచుగా ఎన్నుకుంటున్నారు. దీంతో సర్పంచ్ ఎన్నిక జరగని చోట్ల రిజర్వేషన్ వర్తించని ఉప సర్పంచులే సర్పంచ్ హోదాలో పాలన కొనసాగించేఅవకాశంఉంది.