5 July, 2026 | 8:23 AM

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం

04-08-2025 06:53 PM

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటామని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు(Press Club President Vemula Nagaraju) అన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు మేలు చేయడం, వారి కుటుంబాలకు అండగా నిలవటం తమ ప్రధమ కర్తవ్యమని చెప్పారు. ఆ కర్తవ్యాన్ని చిత్తశుద్దితో నెరవేరుస్తున్నామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న కళను నిజం చేసేందుకు ప్రణాళిక సిద్దం చేశామని ప్రకటించారు. ఈ ఏడాది చివరినాటికి హామీలు అమలుపరచి, అన్ని పనులను పూర్తి చేసి గౌరవ సభ్యుల తీర్పు కోరుతామని ప్రకటించారు. 

సోమవారం డెస్క్ జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఇన్సురెన్స్ ఫారాల స్వీకరణ కార్యక్రమంలో వారిని ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ చేస్తున్న కార్యక్రమాలను సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి బొల్ల అమర్, ఉపాధ్యక్షులు గోకారపు శ్యాం, బొడిగె శ్రీను, సహాయ కార్యదర్శులు పొడిచెట్టి విష్ణువర్ధన్, పెద్దపెల్లి వరప్రసాద్, బూర్ల నరెందర్, వలిశెట్టి సుధాకర్, ప్రెస్ క్లబ్ పూర్వ అధ్యక్షులు గడ్డం కేశవమూర్తి, సాక్షి ఎడిషన్ ఇంచార్జ్ వర్దెల్లి లింగయ్య, నమస్తే తెలంగాణ ఎడిషన్ ఇంచార్జ్ రామగిరి కిరణ్, డెస్క్ జర్నలిస్టులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.