04-08-2025 06:50:11 PM
కరీంనగర్ (విజయక్రాంతి): పారమిత పాఠశాలల అధినేత డా. ఇనుగంటి ప్రసాదరావు జన్మదిన వేడుకలు నగరంలోని పారమిత విద్యాసంస్థ(Paramita Educational Institution)లలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని 'వీరబ్రహ్మేంద్ర స్వామి అనాథ వృద్ద ఆశ్రమం" ఆశ్రమానికి పారమిత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిలాంత్రఫీ ట్రస్ట్ ద్వారా అనాదలకు నిత్యావసర సరుకులు అందించారు.
7 క్వింటాళ్ళ బియ్యం, 15 కిలోలు చింతపండు, 32 కిలోలు కందిపప్పు, 31 కిలోలు పెసరపప్పు, 31 కిలోల నూనెలను పారమిత పిల్లల నుండి సేకరించారు. ఆశ్రమ నిర్వాహకులైన సీపెల్లి వీరమాదవ్ కు అందించారు. అలాగే పాఠశాల యాజమాన్యం 51 వేల రూపాయలు నగదు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పారమిత డైరెక్టర్లు ప్రసూన, ప్రసాదరావు, రశ్మిత, రాకేశ్, ప్రాచీ, అనుకర్ రావు, వినోదరావు, టి. యస్వీ. రమణ, వి. యు..ఎం. ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు గోపి కృష్ణ, ప్రశాంత్, బాలాజీ, శ్రీకర్, శర్మిష్ఠ, కవిత ప్రసాద్ సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.