calender_icon.png 4 August, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులు నిజాయితీ నిబద్దతతో పనిచేయడం అలవర్చుకోవాలి..

04-08-2025 06:59:36 PM

టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి జి.మధు గౌడ్..

వనపర్తి టౌన్: జర్నలిస్టులు నిజాయితీ నిబద్దతతో పనిచేయడం అలవర్చుకోవాలని రాష్ట్ర కార్యదర్శి జి.మధు గౌడ్(State Secretary G. Madhu Goud) అన్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ వనపర్తి జిల్లా కార్యవర్గ సమావేశంను సోమవారం జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు చీర్ల ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శితో పాటు రాష్ట్ర హౌసింగ్ సొసైటీ సభ్యులు శ్రీనివాసరావు, జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యులు మల్యాల బాలస్వామి, జిల్లా అధ్యక్షులు డి. మాధవరావు, జిల్లా కార్యదర్శి బి.రాజు, పట్టణ అధ్యక్షులు టి.అరుణ్ రాజ్ లు పాల్గొని మాట్లాడారు. సమావేశంకు ముందుగా యూనియన్ కార్యదర్శి నరసింహారాజ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ మాట్లాడుతూ, జర్నలిస్టులు నిజాయితీ నిబద్దతతో పనిచేయడం అలవర్చుకోవాలని అన్నారు.

జర్నలిస్టుగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో యూనియన్ అగ్రభాగాన నిలుస్తుందన్నారు ఇప్పటికే సాధించిన పలు అంశాల గురించి ఆయన వివరిస్తూ విద్య విషయంలో,ఆరోగ్యం విషయంలో యూనియన్ పరంగా సహకరిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. త్వరలో వనపర్తి జిల్లాలో కూడా జర్నలిస్టులకు పునఃశ్చరణ తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు. సీనియర్ జర్నలిస్టులను గౌరవించడం మన యూనియన్ సాంప్రదాయమని అందరూ పాటించాలని ఆయన సూచించారు. వనపర్తి జిల్లాలో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులందరికీ యూనియన్ జిల్లా శాఖ తరఫున ఘనంగా సత్కరించాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు.ఈ సమావేశంలో ముందుగా ఇటీవల మరణించిన జర్నలిస్ట్ తోకల సురేష్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

ఈ కార్యక్రమంలో హెచ్ఎంటీవీ బాలవర్ధన్,సాక్షి టీవీ సురేష్, ప్రైమ్ 9 న్యూస్ సంద రాములు, టీ న్యూస్ మహేష్, ఏఎన్ఎన్ టీవీ ఈశ్వర్, బిగ్ టీవీ అరుణ్ కుమార్, టీవీ6 రవి, దిశ టీవీ అలీం, జర్నలిస్టు టుడే ఫారూఖ్ పటేల్, వి6 నరేందర్, 6టీవీ ముక్తార్, 10 టీవీ మురళి, ఐ న్యూస్ మన్యం, 95 టీవీ విష్ణు, ఇండియా టీవీ మన్యం, నేటి లీడర్ ప్రకాష్, భారత్ టుడే రమేష్, డివై న్యూస్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.