18 April, 2026 | 11:35 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

అభివృద్ధి పనుల్లో ఖమ్మంను ఆదర్శంగా తీర్చిదిద్దుతా..

14-06-2025 12:31 AM
  1. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు 

నాట్ల కంటే ముందే రైతుల బ్యాంకు ఖాతాలో రైతు భరోసా జమ

ఖమ్మం, జూన్ -13 (విజయ క్రాంతి ):అభివృద్ధి పనుల్లో ఆదర్శంగా ఖమ్మంను తీర్చి దిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.శుక్రవారం మంత్రివర్యులు రఘునాథపాలెం మండలంలో ప ర్యటించి రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

కోయచలక గ్రామం ఎస్సీ కాలనీలో 20 లక్షల తో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ నిర్మాణ పనులకు, కోయచలక నుండి కా మాంచికల్ వరకు 2 కోట్ల 50 లక్షలతో ని ర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన, కోయచలకలో 16 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ప్రా రంభోత్సవం చేసారు.కోయచలక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాల ను కొనసాగిస్తూ ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతున్నదని అ న్నారు.

గ్రామ అభివృద్ధి కోసం అందరూ ప్ర శాంతంగా, కలిసి మెలిసి పని చేసుకోవాలని ఆయన సూచించారు.అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పేదలకోసం పనిచేసే ప్రభుత్వం అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డి.సి.సి.బి. చైర్మన్ దొండపాటి వెంకటే శ్వర రావు, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, వ్యవసా య శాఖ జిల్లా అధికారి డి. పుల్లయ్య, ఖ మ్మం ఆర్డీఓ నరసింహారావు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.