13-11-2025 12:00:00 AM
- గురుకుల పాఠశాల అభివృద్ధికి 3 కోట్ల 80 లక్షలు మంజూరు
- దానవాయిగూడెం పాఠశాల, కళాశాల భవన మరమ్మతు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి
ఖమ్మం, నవంబర్ -12 (విజయ క్రాంతి): దానవాయి గూడెం గురుకులాన్ని ఆదర్శ వంతంగా తయారు చేస్తామని రాష్ట్ర రెవె న్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.మంత్రి, ఖమ్మం ముని సిపల్ కార్పొరేషన్ పరిధి దానవాయిగూడెంలో టి.జి.ఎస్.డబ్ల్యు.ఆర్. పాఠశాల, జూని యర్ కళాశాల (బాలికలు) భవన మరమ్మతు పనులకు బుధవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం మున్నేరు నదికి వచ్చిన భారీ వరదల కారణంగా ఈ పాఠశాలలోని విద్యార్థులు బిక్కు బిక్కు మంటూ గడిపారని, అప్పుడు పిల్లలకు ఇచ్చిన మాట మేరకు 3 కోట్ల 80 లక్షల రూపాయలను కేటాయించడం జరిగిందని అన్నారు. లో లెవల్ పాఠశాలకు ఎర్త్ ఫిల్లింగ్ చేయడం, అంతర్గత సిసి రోడ్ల నిర్మాణం, కాంపౌండ్ వాల్ పూర్తి చేయడం, వెయిటింగ్ హాల్, జనరేటర్ ఏర్పాటుకు 3 కోట్ల 80 లక్షల రూపాయలు వినియోగించుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అన్నారు.
కాంపౌండ్ లోపల లో లెవెల్ ఉన్న భూమి అయితే ఫిల్లింగ్ పనులు సమాంతరంగా చేపట్టాలని మంత్రి తెలిపారు. క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుం దని, ఇటీవలే మహిళా క్రికెట్ టీమ్ ప్రపంచ చాంపియన్ గా నిలిచిందని, బాలికలు క్రీడలలో రాణించాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుం దని, దానికి అనుగుణంగా ఇక్కడ అవసరమైన క్రీడా ఇన్ ఫ్రా ఏర్పాటుకు అవసర మైన ప్రతిపాదనలు అందించాలని మంత్రి అన్నారు. బాలికలు కోరితే ఇక్కడ స్థానికంగా క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాలని మంత్రి కలెక్టర్ కు సూచించారు.
ప్రతి ఒక్క రూపాయి బాలికలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు డిజైన్ చేసుకోవాలని అన్నారు.పిఎస్‌ఆర్ ట్రస్ట్ నుంచి పాఠశాలకు గతంలో అవసరమైన ఫర్నిచర్ పంపిణీ చేశామని అన్నారు. దానవాయి గూడెం గురుకుల పాఠశాలను ఆదర్శవంతంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటామని అన్నారు.పిల్లలు, తల్లిదండ్రుల కష్టాన్ని గమనించి జీవితంలో ఎద గాలని అమ్మ, నాన్న లను బాగా చూసుకోవాలని అన్నారు. ప్రతి బాలిక జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధన దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య,
జిల్లా సహకార అధికారి గంగాధర్, జిల్లా ఉద్యానవన అధికారి మధుసూదన్, ఇర్రిగేషన్ ఎస్‌ఇ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఎస్‌ఇ యాకోబ్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, కళాశాల ప్రిన్సిపాల్ విజయ దుర్గ, విద్యాశాఖ ఇఇ బుగ్గయ్య, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.