సెల్ టవర్ తీసేంతవరకు ఆందోళన విరమించం
సెల్ టవర్‌కు వ్యతిరేక పోరుబాటలో కాలనీవాసులు
కుషాయిగూడ ఏప్రిల్ 9 (విజయ క్రాంతి) : చర్లపల్లి ఈసీ నగర్ కాలనీలో కమ్యూనిటీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ను వెంటనే తొలగించాలని కాలనీవాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా కాలనీవాసులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ మధ్యలో సెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ ప్రభావంతో అనారోగ్య సమస్యలు పెరుగుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా సమీపంలో పార్క్ ఉండటంతో అక్కడికి వచ్చే వృద్ధులు, చిన్నారులు రేడియేషన్ ప్రభావానికి ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. పాఠశాలలకు వెళ్లే పిల్లలు, గర్భిణీ స్త్రీలు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని వారు వివరించారు. నివాస ప్రాం తంలో ఈ విధంగా సెల్ టవర్ ఏర్పాటు చేయడం సరికాదని, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టవర్లకు అనుమతులు ఇవ్వకూడదని కాలనీవాసులు పేర్కొన్నారు.
ఇప్పటికే పరిసరాల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, గుండె శస్త్రచికి త్స చేయించుకున్నవారు ఉన్నారని చెప్పి, మరింత ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. సమస్యపై సంబంధిత అధికారులకు, స్థానిక నాయకులకు, ఎమ్మెల్యేకు, జిల్లా కలెక్టర్కు పలు మార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈసీ నగర్ కాలనీవాసులకు మద్దతుగా విద్యార్థులు వచ్చి నిరసన కార్యక్రమం లో పాల్గొని నిరసన తెలిపారు సెల్ టవరవద్దు ఆరోగ్యమే ముద్దు షెల్ టవర్ ను ఎత్తివేసి మా ఆరోగ్యాలను పరిరక్షించండి అంటూ మహాప్రభు అంటూ ప్రభుత్వానికి వేడుకున్నారు ఈ నిరసన కార్యక్రమంలో కడియాల జనార్ధన్, లక్ష్మారెడ్డి, కడియాల రాకేష్, కొమ్ము రమేష్, ఫ్రాంచెస్, మొగులయ్య, సురేష్, కడియాల ప్రణయ్, శ్రీకర్, డేవిడ్, అభినవ్, మోహన్ రావు, రోహిత్, నాగేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.




