రాంజీ గోండు స్ఫూర్తితో ముందుకు వెళ్దాం
మాజీ ఎంపీ సోయం బాబురావు
నిర్మల్/ఆదిలాబాద్/కుమ్రం భీం ఆసిఫాబాద్/ఉట్నూర్, ఏప్రిల్ ౯ (విజయక్రాంతి): నిజాం నిరంకుశ పాలనపై ఆదివాసుల హక్కు ల కోసం పోరాడిన రాంజీ గోండు స్ఫూర్తితో హక్కుల కోసం పోరాడుదాం అని మాజీ ఎం పీ, తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు సోయం బాబురావు అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివాసీల సంఘం ఆధ్వర్యం లో రాంజీ గోడు వర్ధంతి వేడుకలు పాల్గొన్నారు.
వెయ్యి ఊడలమర్రి స్థూపం వద్ద, చైన్ గేట్ వద్ద రాంజీ ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘం నాయకులు శంభు తదితరులు పాల్గొన్నారు. అలాగే రాం జీ గోండు వర్ధంతిని వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాంజీ గౌడ్ వివరాలకు పూలమాలవేసి పార్టీ నేతలు నివాళులర్పించారు. బిజెపి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, పార్టీ నాయకులు రావుల రామనాథ్. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంబడి రాజేశ్వర్, సిఐటియూ నాయకులు, ఆదివాసి గిరిజనులు నివాళి అర్పించారు.
పోరాటాల వీరుడు రాంజీ గొండ్: ఎమ్మెల్యే వెడ్మ
ఆదివాసీల హక్కులకై పోరాడిన వీరుడు రాంజీ గోండ్ అని, ఆయన పోరాటాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్ మండలంలోని రాంజీ గొండ్ నగర్‌లో గురువారం నిర్వహించిన రాంజీ గొండ్ వర్ధంతి సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గోండు వీరుడి చిత్ర పటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ తాను డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అప్పటి నుండి ప్రతి ఉపన్యాసంలో ఉద్యమకారుడు రాంజీ గొండ్ ని ఉదాహరణ గా చెపుతున్ననానీ, నాయకుడు అవ్వాలనుకు నే వారు ఉద్యమాలు చేసిన ఎందరో పోరాటా వీరులను స్పూర్తిగా తీసుకొని సమాజంలో పోరాడాలని సూచించారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి సామాజిక వర్గంలోని ఉద్యమకారుల జయంతి, వర్ధంతి లను ఘనంగా నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. రాంజీగొండ్ నగర్ సమస్యలు పరిష్కరిస్తానని, పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి అధికారులను ఆదేశిస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.పి.ఓ ఆత్రం భాస్కర్, ఆదివాసీ నాయకులు ఆత్రం భుజంగరావు, మెస్రం మనోహర్, మర్సకోల తిరుపతి, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాంజీ గోండ్ పోరాటం స్ఫూర్తి దాయకం: జోగు రామన్న
బ్రిటిష్ పాలకులను ఎదురించడంతో పాటు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన ఆదివాసీ పోరు బిడ్డ రాంజీ గోండ్ 166వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. గురువారం స్థానిక బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన వర్థంతి కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీష్, మాజీ ఎంపీ, రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీల సంస్కృతి సాంప్ర దాయాలకు అనుగుణంగా పూజలు చేసి, జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోరా ట యోధుడి విగ్రహాని ఆదివాసీ నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు.
ఈ మేరకు మాజీ మంత్రి రామన్న మాట్లాడుతూ.. మహనీయుల జయంతి, వర్ధంతి సందర్భంలోనే కాకుండా ఎప్పుడు వారిని స్మరించుకోవాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ... ఆదిలాబాద్ జిల్లా అంటే అడువుల జిల్లానే కాకుండా ఆదివాసుల జిల్లా అని పేర్కొన్నారు. దేశ స్వతంత్య్ర సమరంలో రాంజీ గోండ్ పాత్ర కీలకమన్నారు. స్వతంత్య్ర ఉద్యమంతో పాటు ఆదివాసుల హక్కుల కోసం పోరాడారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఆత్రం వేంకటేష్, నాయకులు అజయ్, మెట్టు ప్రహ్లాద్, రాజు, ఆదివాసీ నాయకులు మడావి రాజు, సిడం రాంకిషన్, కుర్సుంగ తనాజీ, గేడం మాదవ్, జంగు పటేల్, దుర్వ నగేష్ తదితరులు పాల్గొన్నారు.
చరిత్ర మరువని వీరుడు రాంజీ..
జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యం లో ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధుడు రాంజీ గోండు 166వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జాదవ్ మాట్లాడుతూ రాంజీ గోండు చరిత్రను నేటి తరానికి తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గెడం టికానంద్, దుర్గం రాజ్కుమార్, దుర్గం నిఖిల్, కేవీపీఎస్ నాయకులు దుర్గం పవన్కుమార్, సీఐటీయూ నాయకులు కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.




