calender_icon.png 12 September, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఇబ్బందులు కలగనివ్వం

08-08-2024 03:12:27 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రుణమాఫీ పథకాన్ని అమలు చేయడం కోసం అన్ని డీసీసీబీలకు టీఎస్ క్యాబ్ జీవో, మార్గదర్శకాలు, ఎస్‌వోపీని లేఖ ద్వారా తెలియజేసినట్లు తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎం సురేశ్ బుధవారం తెలిపారు. రుణమాఫీ అమలులో 30 వేల ఖాతాలకు సంబంధించి చెల్లని ఆధార్, లోపాలు ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కాగా 157 పీఏసీఎస్‌ల పరిధిలో 3,982 మంది లబ్ధి పొందలేకపోయారని, దానికి కారణమైన పీఎసీఎస్ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ఆర్‌సీఎస్‌కు లేఖ రాసినట్లు చెప్పారు.