15 March, 2026 | 7:54 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

బెదిరింపులకు పాల్పడే వారిని వదిలిపెట్టం

16-04-2025 12:01 AM

ఎమ్మెల్సీ కవిత వార్నింగ్ 

కామారెడ్డి, ఏప్రిల్ 15 (విజయక్రాంతి ): బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మంచివారు అయి ఉండొచ్చు కానీ తాను కొంచెం రౌడీ టైపు అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు. బి ఆర్‌ఎస్ రజ తోత్సవ సభకు వెళ్లొద్దని కొందరు ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందని, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లన్నింటినీ పింక్ బుక్కులో రాసుకుంటామని హెచ్చరించారు.  కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజక వర్గంలో బిఆర్‌ఎస్ రజాతోత్సవ సన్నాహక సమావేశంలో మంగళవారం పాల్గొన్న కవిత మీడియాతో మాట్లాడారు.

బిఆర్‌ఎస్ నేతలను ఎవరెవరు బెదిరిస్తున్నారు తమకు తెలుసని వాళ్ళ పేర్లను బరాబర్ పింక్ బుక్కు లో రాసుకుంటామన్నారు. బెదిరింపులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపె ట్టేది లేదని, కేసులు పెట్టించే వారిని పోలీసు స్టేషన్కు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదని ,తేల్చి చెప్పారు. టిఆర్‌ఎస్ కార్యకర్తల ను వేధించే కాంగ్రెస్ నాయకులు అధికా రులు ఎవరైనా ఉరుకునేది లేదన్నారు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు ఇక్కడ భయపడే వారెవరు లేదన్నారు.

కాంగ్రెస్ వాళ్ళ తాతలు, ముత్తాతలు, జేజమ్మలు, ఎవరు దిగొచ్చినా కూడా భయపడే వాళ్ళు లేదని వ్యాఖ్యానించారు. మాట తప్పడం మడత తిప్పడమే కాంగ్రెస్ నైజం అని సోనియా గాంధీ రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారెంటీ కార్డులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ పంచి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. తెలంగాణ బిడ్డల ఆత్మబలి దానాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. ఏడాదిన్నర పాలనలోనే ఇంత వ్యతిరేకత ము ట గట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వా నీకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని సెటైరు వేశారు. ఈ సమావేశంలో బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు.