17 April, 2026 | 11:27 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బద్నాం చేస్తే ఊరుకోం

29-05-2025 12:27 AM

- మాదిగ కులస్థులకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలి 

- ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు కాంగ్రెస్ ఇష్టం లేకపోతే బీజేపీలోకి వెళ్లిపో

- ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం 

ఖైరతాబాద్; మే 28 (విజయక్రాంతి) కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, రాష్ట్రంలో యాభై లక్షలకు  పైగా  జనాభా గల మాదిగ కులస్థులకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిలు రాష్ట్ర ప్రభుత్వానికి, ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో అత్యధిక జనాభా గల మాదిగలకు  మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ హోంశాఖ కేటా యించాలని కోరారు. ఇటీవల జరిగిన సరస్వతి పుష్కరాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సందర్శించినప్పుడు స్థానిక ఎంపీ గడ్డం వంశీని ఆహ్వానించలేదన్న నెపంతో చెన్నూ రు

ఎమ్మెల్యే గడ్డం వివేక్ రాష్ట్రంలో మాల సంఘాలను రెచ్చగొట్టి  కాంగ్రెస్ పార్టీని, ఐటి మంత్రి శ్రీధర్ బాబుని బదనం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. పెద్దపల్లి లో గడ్డం వంశి గెలవడానికి ముఖ్య కారణం మంత్రి శ్రీధర్ బాబు అని తెలిపారు. గడ్డం వివేక్ కాంగ్రెస్ పార్టీ ఇష్టం లేకుంటే బీజేపీలోకి వెళ్లిపోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు బాబురావు, బోరెల్లి సురేష్, నక్క మహేష్, మొగులయ్య, నరేష్, మీసాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.