20 June, 2026 | 2:30 AM

పెండింగ్ రెవెన్యూ దరఖాస్తులను సత్వరం పరిష్కరిస్తాం

20-06-2026 01:50 AM

కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్, జూన్ 19 ( విజయక్రాంతి ): జిల్లాలో పెండింగ్లో ఉన్న నక్ష సర్వే, సాదా బైనామా, భూభారతి దరఖాస్తులతో పాటు రెవెన్యూ సదస్సుల్లో అందిన వినతులను త్వరిత గతిన పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ తెలిపారు. రాష్ట్ర సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్, రెవెన్యూ అంశాలపై ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు.