17-10-2025 12:25:35 AM
హైదరాబాద్, అక్టోబర్ 16(విజయక్రాంతి): క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రోగులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని ట్రస్ట్ చైర్మన్, టీఎన్‌జీఓ సెంట్రల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సైనీ ముజీబ్ పేర్కొన్నారు. గురువారం రూ.21 వేల విలువైన చెక్కును ట్రస్ట్ తరఫున ఆయన క్యాన్సర్ ఆస్పత్రి డైరక్టర్ బెంజెమైన్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా హుస్సైనీ ముజీబ్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ చేపట్టిన నిరంతర సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ చెక్కును క్యాన్స ర్ వ్యాధితో బాధపడుతున్న వారికి అందజేశామన్నారు. అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ ఎల్లప్పుడూ సమాజంలోని బలహీన వర్గాల కోసం ఆరోగ్య, విద్య మరియు సేవా రంగాల్లో సహాయం అందిస్తూ ముందంజలో ఉంటుందని తెలిపారు. భవిష్యత్‌లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.
టీఎన్‌జీఓ హైదరాబాద్ జిల్లా సెక్రటరీ కూరడి శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసి డెంట్ కేఆర్ రాజ్‌కుమార్, కాన్సర్ హాస్పిటల్ నర్సింగ్ సూపరెంటెండెంట్ పుష్పలత, టీఎన్‌జీయూ సెంట్రల్ స్పోరట్స్ సెక్రటరీ శంకర్, టీఎన్‌జీవో యూనియన్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు శ్రీధర్, క్యాన్సర్ హాస్పిటల్ యూనిట్ అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శి శేఖర్, సభ్యులు సాయి, హరీశ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.