11-04-2025 12:44:25 AM
గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి
పాలకవర్గం, అధికారులతో కలసి మార్కెట్ కి వచ్చిన మామిడి పరిశీలన
అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 10: గడ్డి అన్నారం మార్కెట్ కు వచ్చే మామిడి రైతులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కనిపిస్తామని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం పాలకవర్గం, అధికారులతో కలిసి బాట సింగారం మార్కెట్ యార్డ్ కు వచ్చిన మామిడి క్రయవిక్రయాలను తెలుసుకున్నారు.
మార్కెట్ కి వచ్చే మామిడి రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యమని.. గిట్టుబాటు ధర కనిపిస్తామన్నారు. అనంతరం చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. గడ్డి అన్నారం మార్కెట్ కు వచ్చే మామిడి రైతులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మామిడి దిగుబడి అధికంగా ఉందన్నారు.
రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యమని అన్నారు.రైతులకు మంచి గిట్టుబాటు అందించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. రోజుకు 800 వాహనాలు మార్కెట్ కి వస్తున్న తరుణంలో ట్రాఫిక్ కి ఇబ్బంది కలగాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరచారి చారి, డైరెక్టర్లు బండి మధుసూదన్ రావు, అంజయ్య, నవరాజ్, గణేష్ నాయక్, రఘుపతి రెడ్డి, మేకం లక్ష్మి, గోవర్ధన్ రెడ్డి, మచ్చేందర్ రెడ్డి, నరసింహ, ఎండీ ఇబ్రహీం, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్, హర్ష, విజయ్, మురళి, శ్రీను, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.